పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్

by Shamantha N |
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బెయిల్ మంజూరైంది. భూకబ్జా ఆరోపణల కేసులో ఆయనకు ఇస్లామాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, మరో రెండు కేసుల్లో ఆయన జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఇమ్రాన్ తరఫు న్యాయవాది తెలిపారు.

ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు చట్టవిరుద్ధంగా ఆయన భార్యకు భూమిని బహుమతిగా ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్ నుండి భూమిని లంచంగా స్వీకరించి.. ఆయన భార్యకు దాన్ని బహుకరించారని కేసు నమోదైంది. కాగా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఇమ్రాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈవిషయాన్ని ఇమ్రాన్ తరఫు న్యాయవాది నయీమ్ హైదర్ పంజుతా సోషల్ మీడియా ఎక్స్ లో ప్రకటించారు. మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ మరో రెండు కేసుల్లో కస్టడీలో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ రహస్యాల లీకింగ్, ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘించి వివాహం చేసుకున్నారనే రెండు కేసుల్లో ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారు.

గతేడాది ఆగస్టు నుంచి ఇమ్రాన్ జైలులో ఉన్నారు. మొత్తంగా, నాలుగు కేసుల్లో దోషిగా తేలాడు. రెండు కేసుల్లో శిక్షలు తాత్కాలికంగా నిలిపివేశారు. 2022లో అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన తర్వాత పాక్ లో హింసను ప్రేరేపించారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. 2018లో ఇమ్రాన్ ఖాన్ ను అక్రమంగా వివాహం చేసుకున్న కేసులో ఆయన భార్య బుష్రా బీబీ జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Advertisement

Next Story