- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశంలో సమానత్వవాన్ని కొనసాగించాలి: సీజేఐ చంద్రచూడ్
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో సమానత్వవాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. అందుకు పరస్పర సోదరభావం అవసరమని తెలిపారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో శనివారం నిర్వహించిన ‘హమారా సంవిధాన్ హమారా సమ్మాన్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగ స్పూర్తికి లోబడి ఒకరికొకరు గౌరవించుకోవాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాతలు మనకు ఎంతో ఉన్నతమైన ఆదర్శాలను ప్రసాదించారని, వాటిని కాపాడుకోవాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లా కోర్టులను చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఎందుకంటే ఇది న్యాయం వైపు మొదటి అడుగు అని చెప్పారు. జిల్లా కోర్టుల భవనాలను సైతం ఆధునీకరించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.
సాంకేతికతను ఉపయోగించి దాని సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సుప్రీంకోర్టు పనిచేస్తోందని తెలిపారు. కొన్నేళ్ల క్రితం వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణలు ప్రారంభించామని, ప్రస్తుతం అనేక మంది న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణకు హాజరై వాదనలు వినిపిస్తున్నారని చెప్పారు. సాంకేతిక మార్పుల ద్వారా తీర్పులను అనువదిస్తున్నామని మరిన్ని ప్రాంతీయ భాషల్లో తీర్పులను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు.