- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పర్యావరణవేత్త పద్మ అవార్డు గ్రహీత తులసి గౌడ కన్నుమూత.. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
దిశ, వెబ్ డెస్క్: పర్యావరణవేత్త పద్మ అవార్డు గ్రహీత తులసి గౌడ (80) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. వృద్ధాప్య, అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా బాధపడుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఆమె మరణ వార్త విన్న ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కర్ణాటకు చెందిన తులసి గౌడను అందరూ "చెట్టు తల్లి" అని పిలుస్తారు. ఆమె తన జీవితాంతం పర్యావరణ పరిరక్షణ, చెట్లు, మొక్కల సంరక్షణ కోసం పనిచేశారు. ఆమె అసాధారణ కృషి, అంకితభావాన్ని దృష్టిలో ఉంచుకుని 2021లో కేంద్రం.. పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. తులసి గౌడ మరణవార్తను విన్న ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ట్విట్టర్ లో ప్రధాని ట్వీట్ చేయగా.. తన ట్వీట్ లో.. "తులసి గౌడ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను.. కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త, పద్మ అవార్డు గ్రహీత తులసి గౌడ తన జీవితాన్ని ప్రకృతిని పోషించడానికి, వేలాది మొక్కలు నాటడానికి, మన పర్యావరణాన్ని పరిరక్షించడానికి అంకితం చేసింది. పర్యావరణ పరిరక్షణకు ఆమె మార్గదర్శకంగా నిలుస్తారు. ఆమె పని మన గ్రహాన్ని రక్షించడానికి తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. తులసి గౌడ కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలుపుతున్నాను.. ఓ శాంతి" అని రాసుకొచ్చారు.