- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hypersomnia : చలికాలంలో అతి నిద్ర.. ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే..
దిశ,ఫీచర్స్: ఆలోచనలు మనిషిని ముందుకు నడిపిస్తాయి. నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి. కానీ.. అతి ఆలోచనలు మాత్రం ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఆందోళనకు కారణం అవుతాయి. నిద్ర విషయంలోనూ అదే జరుగుతుంది అంటున్నారు నిపుణులు. నిజానికి ఇది నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే అతి నిద్ర మాత్రం చేటు చేస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
*సాధారణంగా రాత్రిపూట 7 నుంచి 8 గంటలసేపు నిద్ర అవసరమని నిపుణులు చెబుతుంటారు. అయితే కొందరు చాన్స్ దొరికిందనో, చలిగా ఉందనో మరీ ఎక్కువసేపు నిద్రకు కేటాయిస్తుంటారు. 9 గంటలకు మించి నిద్రపోతుంటారు. కానీ ఇది కంటిన్యూ చేస్తే స్లీప్ సర్కిల్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఫలితంగా అతి ఆలోచనలు, తలనొప్పి వంటి ఇబ్బందులు డెవలప్ కావచ్చు అంటున్నారు నిపుణులు. అలాగే ఉదయం త్వరగా లేవకుండా ఎక్కువసేపు నిద్రపోతే.. తిరిగి రాత్రిపూట నిద్రవచ్చే అవకాశం తగ్గుతూ వస్తుంది.
*మన శరీరం తిన్న ఆహారాన్ని, అందులోని చక్కెర స్థాయిలను విచ్ఛిన్నం చేసి ఎనర్జీగా మారుస్తుంది. ఈ ప్రాసెస్ వల్ల డయాబెటిస్ వంటివి రాకుండా ఉంటాయి. అయితే అతి నిద్రవల్ల ఈ పక్రియ నెమ్మదిస్తుంది. కాబట్టి క్రమంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
*అంతేకాకుండా అతినిద్రవల్ల ఆర్టరీ బ్లాక్స్, గుండె సంబంధిత అనారోగ్యాలు పెరుగుతాయని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అందుకని ఎనిమిదిగంటలకు మించి నిద్రపోకపోవడమే మంచిది. పైగా దీనివల్ల శరీరంలో రసాయన చర్యలకు కారణం అయ్యే న్యూరో ట్రాన్స్‌మిటర్ల పనితీరు మందగిస్తుంది. ఇది జీవ గడియారంపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి ఇబ్బందుల తలెత్తవచ్చు. ఎక్కువసేపు నిద్రకు కేటాయించినప్పుడు గంటల తరబడి కదలికలేకుండా ఉంటాం. కాబట్టి కీళ్ల నొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చలికాలంలో అతినిద్ర నడుము, మెడ, కీళ్ల నొప్పులకు కారణం అవుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే అతి నిద్రను వదులుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.