- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
MLA Prakash Reddy: ఎమ్మెల్యే జయసూర్య ప్రకాష్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

దిశ, వెబ్‌డెస్క్: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి (Kotla Jayasurya Prakash Reddy) ఇవాళ అస్వస్థతకు గురయ్యారు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం కర్నూలు (Kurnool)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ ప్రాథమిక చికిత్సను అందించారు. అనంతరం జయసూర్య ప్రకాష్ రెడ్డి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ (Hyderabad)కు తీసుకెళ్లారు. అయితే, ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన అస్వస్థతకు గురైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారనే వార్త నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఆయన అనుచరులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలో తీవ్ర ఆందోళన ఉన్నారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుతూ.. ప్రార్థనలు చేస్తున్నారు.