- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయిని పూర్తిగా రూపుమాపాలి : ఎస్పీ గౌష్ ఆలం
దిశ, బోథ్ : నూతనంగా బోథ్ సీఐ గా నియమితులైన ఏ వెంకటేశ్వరరావు ఈరోజు పోలీసు ముఖ్య కార్యాలయం నందు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి బాధ్యతలను స్వీకరించారు.బోథ్ సర్కిల్ పరిధిలో ఎలాంటి గంజాయి పండించడం కానీ, వర్తకం కానీ, సేవించడం కానీ నిర్వహించకూడదని జిల్లా ఎస్పీ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని తెలియజేశారు. బోథ్ సర్కిల్ పరిధిలో ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ ప్రజలకు మాదకద్రవ్యాల పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని చైతన్య పరుస్తూ ఉండాలని సూచించారు. 2017 సంవత్సరంలో సీఐ గా పదోన్నతి పొంది మహబూబాబాద్ సిసిఎస్, భద్రాద్రి, కొత్తగూడెం,టేకులపల్లి లో విధులను నిర్వర్తించి ప్రస్తుతం అదిలాబాద్ జిల్లా బోథ్ కు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిసి దుర్గం శ్రీనివాస్, బోథ్ ఎస్ఐ ప్రవీణ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.