- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పూర్తి చేయాలి.. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
దిశ, భిక్కనూరు : లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇందిరమ్మ యాప్ లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. మంగళవారం నాడు ఆయన భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే పనులను ఆయన పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉంటున్న నివాసం ఉంటున్న ఇంటితో పాటు, లబ్ధిదారులకు సంబంధించిన ఫోటో, సొంత ఇల్లు ఉంటే, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను, ఇంటి పన్నుకు సంబంధించిన రసీదులను యాప్ లో పొందుపరచాలని ఆదేశించారు.
అర్హులైన వారికే లబ్ధి చేకూర్చే విధంగా సర్వే చేపట్టాలన్నారు. ఇంటి నిర్మాణం కోసం అవసరమైన స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను సైతం ఆ యాప్ లో ఎక్కించాలన్నారు. నిర్దేశించిన గడువులోగా సర్వేను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిలువ నీడలేని నిరుపేదల వద్దకు చేరుకొని వారి జీవనస్థితిగతుల వివరాలను జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎల్పీఓ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారిని రజిత, తహశీల్దార్ కే.శివప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజ్ కిరణ్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి భార్గవి తదితరులు ఉన్నారు.