బిగ్ షాకిచ్చిన మైత్రీ మూవీ మేకర్స్.. ‘రాబిన్ హుడ్’ రిలీజ్ వాయిదాపై ట్వీట్

by Hamsa |
బిగ్ షాకిచ్చిన మైత్రీ మూవీ మేకర్స్.. ‘రాబిన్ హుడ్’ రిలీజ్ వాయిదాపై ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’(Robin Hood). ఈ సినిమాకు వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అయితే దీనిని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యేర్నెని, రవిశంకర్‌లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ ‘రాబిన్ హుడ్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

దీంతో ప్రేక్షకులు ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా? అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఇక ‘రాబిన్ హుడ్’ రిలీజ్‌కు ఇంకా వారం ఉందనగా మూవీ మేకర్స్ షాకింగ్ ట్వీట్ చేశారు. ‘‘అనుకోని పరిస్థితుల కారణంగా ‘రాబిన్ హుడ్’(Robin Hood) అనుకున్న ప్రకారం డిసెంబర్ 25న విడుదల కావడం లేదు. మీ ఉత్సాహాన్ని అలాగే పట్టుకోండి.

వినోదం వేచి ఉండటం వల్ల విలువైనదే అవుతుంది. ఈ అడ్వెంచరస్ ఎంటర్‌టైనర్(Adventurous Entertainer) థియేటర్‌లలోకి వచ్చినప్పుడు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాము’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన సినీ ప్రియులు షాక్ అవుతున్నారు. అలాగే చివరి నిమిషంలో బిగ్ షాకిచ్చారుగా అని చర్చించుకుంటున్నారు. అయితే ఈ క్రిస్మస్‌కు ఏకంగా 10 చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో ‘రాబిన్ హుడ్’ పండగ రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed