High Court: ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు ఊరట.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

by Ramesh N |
High Court: ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు ఊరట.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో (Locality) స్థానికతపై ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు (Telangana in High Court) తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇతర రాష్ట్రాల్లో చదివిన రాష్ట్ర విద్యార్థులను స్థానికంగా పరిగణించాలని ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ మేరకు జీవో 140 సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

జీవో 140 ప్ర‌కారం 6వ త‌ర‌గ‌తి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు తెలంగాణ‌లో చ‌ద‌వ‌డంతో పాటు ఎంబీబీఎస్ కూడా ఇక్క‌డే పూర్తి చేసిన వారికి తెలంగాణ స్థానికత క‌ల్పిస్తారు. అయితే ఈ జీవో 140ని స‌వాల్ చేస్తూ (MBBS and BDS students) మెడిక‌ల్ పీజీ విద్యార్థులు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో ప్ర‌భుత్వం తెచ్చిన జీవోని స‌వ‌ర‌ణ చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed