భారత సంతతికి చెందిన ఇంజినీర్ పై మస్క్ ప్రశంసలు.. ఎందుకంటే?

by Shamantha N |
భారత సంతతికి చెందిన ఇంజినీర్ పై మస్క్ ప్రశంసలు.. ఎందుకంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత సంతతికి చెందిన ఇంజినీర్ ఎల్లుస్వామిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. టెస్లా ఆటోపైలట్ బృందంలో ఎల్లుస్వామి ప్రధాన పాత్ర పోషించారని కొనియాడారు. ఆ టీంలో చేసిన తొలి వ్యక్తి ఆయనే అని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోపైలట్ సాఫ్ట్ వేర్లలో టెస్లా సాధించిన విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎల్లుస్వామి టీంకి ధన్యవాదాలు తెలిపారు.

ఎల్లుస్వామిపై మస్క్ ప్రశంసలు

2014లో ఆటోపైలట్‌ను ఓ చిన్న కంప్యూటర్‌తో ప్రారంభించామని మస్క్ గుర్తుచేసుకున్నారు. అది కేవలం 384కేబీ మెమోరీ సామర్థ్యం ఉన్న చిన్న డెస్క్‌టాప్‌ అని పేర్కొన్నారు. లేన్‌ కీపింగ్‌, లేన్‌ ఛార్జింగ్‌.. వంటివి అమలు చేయాలని ఇంజినీరింగ్‌ బృందానికి మస్క్‌ సూచించినా ఎవరూ ఆయన మాటల్ని విశ్వసించలేదని తెలిపారు. అయినా.. ఏమాత్రం విశ్వాసం కోల్పోకుండా ఎల్లుస్వామి లక్ష్యం దిశగా టీంని నడిపించారని కొనియాడారు. అలా 2015లో మొట్టమొదటి ఆటోపైలట్‌ సిస్టమ్‌ను తీసుకొచ్చారని గుర్తుకు తెచ్చుకున్నారు. మరోవైపు, ఎలాన్ మస్క్ గురించి ఎల్లుస్వామి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన దూరదృష్టి సాటిలేనిదని కొనియాడారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని టెస్లాను అగ్రగామిగా నిలిపారన్నారు. ఆటోమేటిక్ కార్లు, హోమ్ రోబోట్స్ భవిష్యత్ లో భాగమవుతాయని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed