ఉత్సవాల్లో ఏనుగుల యుద్ధం!

by Ramesh N |
ఉత్సవాల్లో ఏనుగుల యుద్ధం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ రాష్ట్రంలో ఏనుగులతో దేవతల ఊరేగింపు ఉత్సవాలు కనుల పండుగగా జరుపుతారు. అయితే తాజాగా అరట్టుపుజా ఆలయ ఉత్సవాల్లో దేవలతను ఊరేగింపు సందర్భంగా ఏనుగులు బీభత్సం సృష్టించాయి. నిన్న త్రిస్సూర్‌లోని తారక్కల్ ఆలయ ఉత్సవాల ముగింపు దశకు చేరుకున్నాయి. గ్రాండ్‌ లైటింగ్, సౌండ్స్‌తో ఉత్సవాలు నిర్వహించారు. అయితే ఒక్కసారిగా దేవతను ఊరేగించే ఓ ఏనుగు మరో ఏనుగు పై దాడి చేసింది. రెండు ఏనుగులు కోట్లాడంతో ఏనుగులపై కూర్చుని ఉన్న వ్యక్తులు నేలపైకి విసిరిపడ్డారు.

ఈ క్రమంలోనే ఏనుగులు సృష్టించిన భీభత్సవం వల్ల పలువురు గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఉత్సవాల్లో ఏనుగులను మావటి కంట్రోల్ చేయలేకపోయారు. తర్వాత ఉత్సవాలు జరిగే ప్రదేశం నుంచి ఏనుగులు బయటకు ఒక కిలోమీటరు వరకు పరుగులు తీసినట్టు సమాచారం. అనంతరం ఏనుగులను మావటీలు అదుపులోకి తెచ్చినట్లు తెలిసింది.

Advertisement

Next Story