Drugs seize: ఢిల్లీలో భారీగా డ్రగ్స్ సీజ్.. తిహార్ జైలు వార్డెన్ సమక్షంలోనే తయారీ

by vinod kumar |
Drugs seize: ఢిల్లీలో భారీగా డ్రగ్స్ సీజ్.. తిహార్ జైలు వార్డెన్ సమక్షంలోనే తయారీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో తిహార్ జైలు వార్డెన్, ఒక వ్యాపారవేత్తతో సహా నలుగురు వ్యక్తులు నడుపుతున్న రహస్య మెథాంఫేటమిన్ తయారీ ల్యాబ్‌ను పోలీసులు ఛేదించారు. ఇంటలిజెన్స్ సమాచారం మేరకు ఈనెల 25న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం గ్రేటర్ నోయిడా(Greater Noida) పరిధిలో సంయుక్తంగా దాడులు చేపట్టాయి. ఈ క్రమంలోనే ఓ ఇంట్లో డ్రగ్స్ తయారీ చేస్తున్న ల్యాబ్‌ను గుర్తించారు. ఇక్కడ డగ్స్ తయారు చేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో పలు కెమికల్స్ (chemicals), అధునాతన తయారీ యంత్రాలతో పాటు ఘన, ద్రవ రూపాల్లో ఉన్న సుమారు 95 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశారు.

తిహార్ జైలు వార్డెన్ సహా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అక్టోబర్ 27న మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా..వారికి మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఢిల్లీకి చెందిన మెక్సికన్ పౌరుడు, ఓ వ్యాపారవేత్త అక్రమ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించగా.. వారికి జైలు వార్డెన్ సహకరించినట్టు తెలుస్తోంది. ముంబైకి చెందిన రసాయన శాస్త్రవేత్త పర్యవేక్షణలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు ఎన్‌సీబీ తెలిపింది. ఈ డ్రగ్స్‌ను భారత్‌లోనే కాకుండా విదేశాలకు కూడా పంపేందుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ నెల ప్రారంభంలోనూ భారీ అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌ను వెలికితీసి రూ. 7,600 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story