- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Donald Trump: అమెరికాకు స్వర్ణయుగమే.. దేవుడు ఇందుకే ప్రాణాలు నిలిపాడు: డొనాల్డ్ ట్రంప్ విక్టరీ స్పీచ్
దిశ, నేషనల్ బ్యూరో: మూడు స్వింగ్ స్టేట్లు నార్త్ కరోలినా, జార్జియా, పెన్సిల్వేనియాల్లో విజయం సాధించిన తర్వాత బుధవారం ఉదయం వెస్ట్ పామ్ బీచ్‌లోని వేదికపై నుంచి డొనాల్డ్ ట్రంప్ తన విజయ సందేశాన్ని ఇచ్చారు. భావోద్వేగంతో మాట్లాడుతూ మనమంతా చరిత్ర సృష్టించామన్నారు. ఇలాంటి ఉద్యమాన్ని అమెరికా ఎప్పుడూ చూడలేదని, ఇదే గొప్ప రాజకీయ ఉద్యమం అని అభిప్రాయపడ్డారు. ఈ మలుపు అమెరికాకు ఎంతో అవసరమని చెప్పారు. ఇది అమెరికాకు స్వర్ణయుగమని, దేశాన్ని సురక్షిత, సుసంపన్నం చేస్తామని వివరించారు. ఆర్థిక బలోపేతం, రక్షణ, అభివృద్ధితో అమెరికాను బంగారు భవిష్యత్ వైపు తీసుకెళ్లుతామని తెలిపారు. గత నాలుగేళ్లుగా సాగిన విభజనకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చిందని, ప్రజలంతా ఏకమై దేశం కోసం పాటుపడాలని పిలుపు ఇచ్చారు. తనపై జరిగిన హత్యా ప్రయత్నాలను గుర్తు చేసుకుంటూ తాను చేయాల్సిన బాధ్యతలు ఇంకా ఉన్నాయనే దేవుడు తన ప్రాణాలు నిలిపి ఉంచాడని వివరించారు.
లీగల్‌గానే ఎంట్రీ:
ఒక మొదటి నుంచీ అక్రమ వలసలు ప్రధానాంశంగా చేసుకుని ప్రచారం చేసిన డొనాల్డ్ ట్రంప్ తన విక్టరీ స్పీచ్‌లోనూ దీనిపై మాట్లాడారు. తాము దేశ సరిహద్దులను మూసేస్తామని స్పష్టం చేశారు. అక్రమ వలసదారులంతా చట్టబద్ధంగా దేశంలోకి రావాల్సి ఉంటుందని వివరించారు. అక్రమ వలసలు ఇక ఉండబోవని పేర్కొన్నారు. అమెరికా చరిత్రలోనే ఎన్నడూలేని స్థాయిలో అక్రమవలసదారులను వారివారి దేశాలకు తిరిగి పంపిస్తామని ట్రంప్ ఇది వరకే స్పష్టం చేశారు.
యుద్ధాలు ఉండవ్:
తాను యుద్ధాలకుపోనని ట్రంప్ చెప్పారు. ఇప్పటికే నడుస్తున్న యుద్ధాలను ఆపుతానని వివరించారు. గతంలో కూడా తన నాలుగేళ్ల పాలనలో యుద్ధాలు చేయలేదని తెలిపారు. అప్పుడు తాము చేసిన ఏకైక యుద్ధం ఐఎస్ఐఎస్‌లపైనేనని, వారిని ఓడించామని వివరించారు. వాస్తవానికి ట్రంప్ గెలుపు క్రమాన్ని చూసి ఉక్రెయిన్ వాసులు ఒకింత ఆందోళనకు గురైనట్టు వార్తలు వచ్చాయి. రష్యాపై యుద్ధానికి ఇది వరకున్న ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ఇకపై లభించదేమో అనే అభిప్రాయాలు వెలువడ్డాయి.
ఎలన్ మస్క్‌కే సాధ్యం..
స్పేస్ ఎక్స్ గురించి ట్రంప్ మాట్లాడుతూ.. అలాంటిది తాను ఎన్నడూ చూడలేదని వివరించారు. లిఫ్ట్ ఆఫ్ చేసిన షటిల్ తిరిగి మళ్లీ లాంచ్ టవర్ ఒడిలో ఒదగడం చూసి ఇది ఎలన్ మస్క్ తప్ప మరెవరూ చేయలేరని చెప్పానని పేర్కొన్నారు. రష్యా, చైనాలు ఇంత సృజనాత్మకత ప్రాజెక్టును చేపట్టగలవా? వాటితో సాధ్యం కావని చెప్పారు. ఎలన్ మస్క్ కాకుండా అమెరికా కూడా ఆ పని చేయలేదని తెలిపారు. మస్క్ ఒక జీనియస్ అని, ఇలాంటి జీనియస్‌లను అమెరికా కాపాడుకోవాలని, అమెరికాలో చెప్పుకోదగిన స్థాయిలో ఇలాంటి జీనియస్‌లు లేరన్నారు. ఇక తన ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌పై ప్రశంసలు కురిపించారు. తమ శత్రువర్గమైన మీడియా క్యాంప్‌లోకి వెళ్లాలని తాను చెప్పగానే వ్యాన్స్ వెళ్లిపోయేవారన్నారు. ఆయన భార్య ఉషాకు కూడా ధన్యవాదాలు తెలిపారు.