Elon Musk: అమెరికా ఫలితాలపై మస్క్ పోస్ట్.. కొత్త స్టార్ అంటూ ట్రంప్ ప్రశంసలు

by Rani Yarlagadda |   ( Updated:2024-11-07 12:25:55.0  )
Elon Musk: అమెరికా ఫలితాలపై మస్క్ పోస్ట్.. కొత్త స్టార్ అంటూ ట్రంప్ ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ (Republican Party) అధ్యక్ష అభ్యర్థి.. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గెలుపుకు చేరువలో ఉన్నారు. ఆయన విజయం దాదాపు ఖరారైనట్లే.. 267 స్థానాల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ.. మరో 3 సీట్లలో విజయం సాధించాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ట్రంప్ ఎన్నిక ఖాయమైన నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా X సీఈఓ, ప్రపంచ అపర కుబేరుడైన ఎలాన్ మస్క్ (Elon Musk) ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. గేమ్ సెట్ అండ్ మ్యాచ్ అని రాసి.. ఒక పోస్ట్ చేశారు. ఆ తర్వాత అమెరికా ప్రజలు ఈరోజు రాత్రికి చారిత్రాత్మక విజయాన్ని ట్రంప్ కు అందిస్తారని మరో పోస్ట్ చేశారు. ట్రంప్ అధ్యక్షుడైతే.. అమెరికాలో ఫెడరల్ ఏజెన్సీల సంఖ్యను తగ్గించాలని సూచిస్తానన్నారు ఎలాన్ మస్క్.

అమెరికా ఎన్నికల ఫలితాలపై మాట్లాడిన ట్రంప్.. తన విజయానికి కృషి చేసిన ఎలాన్ మస్క్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనపై ప్రశంసలు కురిపించారు. అమెరికా రాజకీయాల్లో ఎలాన్ మస్క్ కొత్త స్టార్ అని కొనియాడారు. తమ విజయంలో ఎలాన్ మస్క్ దే కీలక పాత్ర అని తెలిపారు.

Advertisement

Next Story