US presidential Election: ట్రంప్ వర్సెస్ హ్యారిస్.. సెప్టెంబర్ 4న బిగ్ డిబేట్

by Shamantha N |
US presidential Election: ట్రంప్ వర్సెస్ హ్యారిస్.. సెప్టెంబర్ 4న బిగ్ డిబేట్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలు హోరాహోరీగా సాగుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హ్యారిస్ అధ్యక్ష రేసు బరిలో నిలిచారు. అయితే, ఆమెతో చర్చ జరిపేందుకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెడీ అయ్యారు. ఫాక్స్ న్యూస్ ఆఫర్ ను ఆయన అంగీకరించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ వేదికగా వెల్లడించారు. వచ్చే నెలలో వీరిద్దరి మధ్య డిబేట్ జరగనుంది. ‘‘సెప్టెంబరు 4న ఫాక్స్‌ న్యూస్‌ నిర్వహించే బిగ్ డిబేట్ ఈవెంట్‌లో కమలా హ్యారిస్‌ తో తలపడనున్నా. అయితే, ఈ తేదీన ఏబీసీ ఛానెల్ లో జో బైడెన్ తో చర్చలో పాల్గొనాల్సింది. కానీ, ఆయన రేసు నుంచి తప్పుకోవడంతో డిబేట్ రద్దయ్యింది. ఫాక్స్‌న్యూస్‌ డిబేట్‌ పెన్సిల్వేనియాలో జరుగుతుంది. బైడెన్‌తో జరిగిన చర్చలోని రూల్స్‌ ఈ డిబేట్ కు కూడా వర్తిస్థాయి.’’ అని ట్రంప్‌ వెల్లడించారు. అయితే.. ఈ డిబేట్‌, దాని కండీషన్స్‌కు కమలా హ్యారిస్ అంగీకరించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ట్రంప్‌తో చర్చ గురించి ఆమెగానీ, ఆమె టీం గానీ ఇప్పటివరకు ఇంకా స్పందించలేదు. అయితే, ఆయనతో చర్చకు తాను సిద్ధమేనని గతంలో కమలా ప్రకటించారు.

Advertisement

Next Story