'భారత్.. ఎన్నడూ ఒక దేశం కాదు': డీఎంకే ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by S Gopi |
భారత్.. ఎన్నడూ ఒక దేశం కాదు: డీఎంకే ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు నేతలు ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం రేపుతున్నారు. ఇటీవల తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. తాజాగా, డీఎంకే ఎంపీ ఏ రాజా మరో సంచన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంసమైంది. ఇటీవల డీఎంకే నిర్వహిచిన కార్యక్రమంలో మాట్లాడిన ఏ రాజా.. 'భారత్ ఎన్నడూ ఒక దేశంగా లేదని, భిన్న సాంప్రదాయాలు, సంస్కృతులకు నిలయమన్నారు. ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి వంటి లక్షణాలు ఉంటే ఒక దేశం అంటారు. కానీ, భారత్ అలా లేదు. భిన్న భాషలు, సంస్కృతుల రాష్ట్రాలను కలిగిన దేశం. భారత్ ఒక ఉపఖండమని' ఆయన తెలిపారు. దీనిపై భగ్గుమన్న బీజేపీ, డీఎంకే పార్టీ వ్యాఖ్యలను 'మావోయిస్ట్ భావజాల'మని విమర్శించింది. 'డీఎంకే ఎప్పటికప్పుడు విద్వేషపూరిత ప్రసంగాలను చేస్తూనే ఉంది. ఈ మధ్యే సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వివాదం ముగియకముందే మరో నేత అదేవిధంగా మాట్లాడటం సమంజసం కాదని' బీజేపీ మండిపడింది. కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు ఈ విషయంలో మౌనంగా ఎందుకున్నాయని బీజేపీ నేతలు ప్రశ్నించారు. రాజా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్, డీఎంకే నేత వ్యాఖ్యలతో ఏకీభవించడంలేదని, ఆయన మాటలను ఖండిస్తున్నామని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed