- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అరవింద్ కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీ తొలగింపు
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికలకు ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించారు. నియామకానికి సంబంధించి కేంద్ర సివిల్ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి బిభవ్ కుమార్‌ను నియమించారని విజిలెన్స్ డైరెక్టరేట్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన 2007లో నోయిడాలో ప్రభుత్వోద్యోగిపై దాడి చేసి ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారనే కేసును ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో బిభవ్ కుమార్, మరో నిందితుడు రాజీవ్ కుమార్‌ను అరెస్టు చేయకుండానే చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ సమర్పించారని ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. ప్రైవేట్ సెక్రటరీగా ఆయన నియామకం సమయంలో ముందు పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయలేదని విజిలెన్స్ విభాగం తెలిపింది.
మంత్రులు, ముఖ్యమంత్రి వంటి స్థాయిల్లో ఉండే వారి వద్ద పనిచేసే వ్యక్తిగత సిబ్బంది నియామకంలో వారి పూర్వాపరాలను ముందస్తుగా విచారించకుండా నియమించడం సరికాదని విజిలెన్స్ డైరెక్టరేట్ పేర్కొంది. బిభవ్ కుమార్ తొలగింపుపై ఆప్ నాయకుడు జాస్మిన్ షా బీజేపీపై తీవ్రంగా విమర్శలు చేశారు, దేశ రాజధానిలో అధికార పార్టీని అంతం చేయడమే కాషాయ పార్టీ ఏకైక లక్ష్యం అని అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై కూడా మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని నకిలీ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు చేశారు. ఇప్పుడు, LG అతని ప్రైవేట్ సెక్రటరీతో సహా మొత్తం సిబ్బందిని తొలగించడం ప్రారంభించింది. దేశ రాజధానిలో ఆప్ ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ ఏకైక లక్ష్యం అనడంలో సందేహం లేదు అని జాస్మిన్ షా పేర్కొన్నారు.