Dilhi court: వరకట్నం హత్య కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు.. భర్త, అత్తమామలను నిర్ధోషులుగా ప్రకటన

by vinod kumar |
Dilhi court: వరకట్నం హత్య కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు.. భర్త, అత్తమామలను నిర్ధోషులుగా ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఓ వరకట్న మరణానికి సంబంధించిన కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వరకట్న వేధింపుల వల్ల మృతి చెందిన మహిళ భర్త, అత్తమామలను నిర్థోషులుగా ప్రకటించింది. సాక్షుల వాంగ్మూలంలో భౌతిక వైరుధ్యాలు ఉన్నాయని పేర్కొంది. వివరాల్లో్కి వెళ్తే..గౌరవ్, నీతులు 2016లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత గౌరవ్ కుటుంబ సభ్యులు మహిళను కట్నం కోసం వేధిస్తూ..నిరంతరం కొట్టేవారు. వేధింపులు పెరిగిపోవడంతో 2018లో ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు నీతు భర్త, ఆయన ఇద్దరు సోదరులు, అత్త మామలపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కేసు విచారణలో ఉండగా.. తాజాగా విచారణ చేపట్టిన కోర్టు భర్త, వారి సోదరులు, అత్తమామలను నిర్ధోషులుగా ప్రకటించింది.

నేరం రుజువు చేయడంలో అస్పష్టమైన ఆరోపణలున్నాయని కోర్టు అభిప్రాయపడింది. అయితే నీతు ఆత్మహత్య చేసుకోవడానికి రెండు రోజుల ముందు తన భర్త, తల్లితో చేసిన ఫోన్ కాల్స్, చాట్‌లను గుర్తించింది. వాటిలోనూ సాధారణ విషయాలను మాత్రమే చర్చించిందని కోర్టు తెలిపింది. వేధింపులు, కట్నం డిమాండ్‌పై డిస్కషన్ లేదని స్పష్టం చేసింది. ఈ కేసును సందేహానికి అతీతంగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ దారుణంగా విఫలమైందని అభిప్రాయపడింది. కాబట్టి నిందితులను నిర్ధోషులుగా విడుదల చేస్తున్నట్టు తెలిపింది.

Advertisement

Next Story