కుప్పకూలిన ట్విన్ టవర్స్.. 9 సెకండ్లలోనే నేలమట్టం

by samatah |   ( Updated:2022-08-28 09:12:42.0  )
కుప్పకూలిన ట్విన్ టవర్స్.. 9 సెకండ్లలోనే నేలమట్టం
X

దిశ, వెబ్‌డెస్క్ : నోయిడాలో ట్విన్ టవర్స్ నేలమట్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ట్విన్ టవర్స్‌ను నిర్మించారని, వాటిని కూల్చి వేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో బటన్ నొక్కి ట్విన్ టవర్స్‌ను అధికారులు కూల్చి వేశారు. 100 మీటర్ల దూరం నుంచి 10 సెకండ్లలోపే 40 అంతస్తుల పెద్ద భవనాలు కుప్పకూలిపోయాయి. అయితే ఈ కూల్చి వేతకు 3.700 కేజీల పేలుడు పదర్థాలు వాడారు. అంతే కాకుండా దీని కూల్చి వేతకు అధికారులు రూ. 23 కోట్లు ఖర్చు చేశారు. చుట్టుపక్కల ఎవరికీ నష్టం వాటిల్లకుండా ట్విన్ టవర్స్‌ను అధికారులు కూల్చివేసినట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed