Packaged Drinking Water: ప్యాకేజ్డ్, మినరల్ వాటర్ సురక్షితమేనా?

by Mahesh Kanagandla |
Packaged Drinking Water: ప్యాకేజ్డ్, మినరల్ వాటర్ సురక్షితమేనా?
X

దిశ, నేషనల్ బ్యూరో: సురక్షిత మంచినీరు అందుబాటులో లేనప్పుడు.. లేదా ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు దాహార్తి తీర్చుకోవడానికి మార్కెట్‌లో లభించే వాటర్ బాటిల్‌(Water Bottle)పైనే ఆధారపడుతాం. ముఖ్యంగా ప్రయాణాల్లో ఈ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్(Packaged Drinking Water), మినరల్ డ్రింకింగ్ వాటర్(Mineral Drinking Water) బాటిళ్లు కొనుగోలు చేస్తుంటాం. బయట కూడా మనకు అందుబాటులో ఉండే సేఫెస్ట్ డ్రింకింగ్ వాటర్ ఇదే అని నమ్ముతాం. కానీ, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ లేదా మినరల్ వాటర్ బాటిల్ కూడా మీ ఆరోగ్యానికి హైరిస్కే అని చెబితే, చెప్పడం కాదు.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ/FSSAI) వీటిని హైరిస్క్ కేటగిరీ(High Risk Category)లో చేర్చేసింది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్‌ను ఇక నుంచి హైరిస్క్ ఫుడ్ కేటగిరీగా ట్రీట్ చేస్తామని ఎఫ్ఎస్ఎస్ఏఐ నవంబర్ 29న ఓ ఆర్డర్‌లో పేర్కొంది. ఈ ఆదేశాలతో ఈ ఉత్పత్తులపై నిఘా పెంచడంతోపాటు తప్పనిసరి తనిఖీలు చేపట్టనున్నారు. ప్రతి యేటా తప్పనిసరిగా మ్యానుఫాక్చరర్లను ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించిన థర్డ్ పార్టీ ఫుడ్ ఆడిటింగ్ ఏజెన్సీ తనిఖీలు చేయాల్సి ఉంటుంది. వాటికి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్‌కు ముందు ఇన్‌స్పెక్షన్ తప్పకుండా ఉంటుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ఫుడ్ ఆడిటింగ్ ఏజెన్సీ ఈ తనిఖీలు చేపడుతుంది. మొన్నటి వరకు

‘హైరిస్క్’ అంటే ఏమిటీ?

నిత్యం తనిఖీ చేయాల్సిన అవసరమున్న ఉత్పత్తులను ఎఫ్ఎస్ఎస్ఏఐ హైరిస్క్ ఫుడ్‌గా నిర్వచిస్తుంది. వీటిని ఏడాదికోసారి ఆడిట్ చేయాల్సి ఉంటుందని భావిస్తుంది. కలుషితమయ్యే ముప్పు అధికంగా ఉండే, స్టోరేజీ, మిస్‌హాండ్లింగ్ అవకాశాలెక్కువ ఉండే, ఫుడ్ పాయిజన్‌ జరిగే ముప్పు ఉండే వాటినీ హైరిస్క్ ఫుడ్స్‌గా పేర్కొంటుంది. ఈ కేటగిరీలో డెయిరీ ఉత్పత్తులు, మాంసం, దాని ఉత్పత్తులు, చేప, గుడ్లు, వాటి ఉత్పత్తులు ఉన్నాయి. వీటితోపాటు ఇండియన్ స్వీట్లు, ప్రిపేర్ చేసిన ఆహారం, ప్రత్యేక పోషకాహార అవసరాల కోసం రూపొందించిన ఫుడ్స్ సహా పలు ఉత్పత్తులను ఎఫ్ఎస్ఎస్ఏఐ హైరిస్క్ ఫుడ్ కేటగిరీలో చేర్చింది. తాజాగా, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినిరల్ వాటర్ బాటిళ్లను ఈ కేటగిరీలో చేర్చింది. అక్టోబర్‌ వరకు ఈ కంపెనీలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ తీసుకోవాల్సి ఉండేది. బీఐఎస్ ప్రమాణాలు పాటించేవాటికే సర్టిఫికేషన్ దక్కేది. కానీ, ఈ సర్టిఫికేషన్ పొందినా.. బాటిల్‌లో కలుషిత నీటి ఆనవాళ్లు చాలా సార్లు కనిపించాయని నిపుణులు చెప్పారు. బీఐఎస్‌తోపాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్స్ కూడా పొందాల్సి ఉండేది. కానీ, అక్టోబర్‌లో బీఐఎస్ సర్టిఫికేషన్ తీసేయడంతో ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ బాటిల్డ్ వాటర్‌ నాణ్యతకోసం, ప్రజారోగ్యం కోసం వీటిని హైరిస్క్ కేటగిరీలో చేర్చింది.

ముప్పు ఎక్కువే

2023లో భారత్‌లో బాటిల్డ్ వాటర్ మార్కెట్ సుమారు రూ. 32 వేల మార్కెట్(3,790 మిలియన్ డాలర్లు) జరిగింది. 2030లో ఇది 8,922 మిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. బాటిల్డ్ వాటర్‌పై ప్రజలు ఎంత ఆధారపడుతున్నారనేది ఈ గణాంకం వెల్లడిస్తున్నది. ఇక వాటిర్ బాటిళ్ల తయారీ రంగంలో 80 శాతం అసంఘిటమే కావడం మరో ఆందోళనకర విషయం. గైడ్‌లైన్స్ పాటించే ప్రాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌తోపోల్చితే అసంఘటితంగా తయారుచేసే బాటిల్డ్ వాటర్‌ కలుషితమయ్యే చాన్స్ ఎక్కువ. ఈ కారణాలతోనే బ్రాండ్ కంపెనీలకు దీటుగా వాటిని అనుకరించే కంపెనీల బాటిళ్లు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. చాలా సార్లు ఈ కంపెనీల నీటిలో నాణ్యత ఉండదు. గత నెలలోనే మన హైదరాబాద్‌లోని చాంద్రయాణగుట్ట, కాచిగూడ సహా పలుచోట్ల వాటర్ ప్లాంట్‌లపై తనిఖీలు చేపట్టి.. అక్కడ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు తేల్చారు. అవి తయారుచేసే వాటిర్ బాటిళ్లలోనూ ప్రమాణాలు లేవని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed