- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajya Sabha: రైతు సమస్యలపై రాజ్యసభలో రగడ.. సభ నుంచి ప్రతిపక్ష ఎంపీల వాకౌట్
దిశ, నేషనల్ బ్యూరో: రైతుల సమస్యలపై విపక్షాలు రాజ్యసభ (Rajya sabha)లో రభస సృష్టించాయి. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) సహా రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. రైతుల సమస్యలు, ఫెయింజల్ తుపాను వల్ల సంభవించిన నష్టం, అదానీ సమస్య, యూపీలోని సంభాల్ హింసపై చర్చించాలని ఐదుగురు ఎంపీలు నోటీసులు ఇచ్చారు. అయితే వీటిపై చర్చించడానికి చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ (Jagadheep dhankad) నిరాకరించారు. దీంతో పలువురు నేతలు వెల్ లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ఎంపీల ఆందోళనల నేపథ్యంలో ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుర్చీ నుంచి లేచి నిలబడి ప్రతిపక్ష నేతలపై ఫైర్ అయ్యారు. ఈ నినాదాలు, మొసలి కన్నీళ్లు ఇక్కడ పని చేయవని, దాని వల్ల రైతుల ప్రయోజనాలు నెరవేరవని తెలిపారు.
ఈ క్రమంలోనే రైతుల సమస్యలపై మాట్లాడాలని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ(Pramod thiwari)కి ధన్ ఖడ్ అనుమతిచ్చారు. పంటలకు ఎంఎస్పీ నిర్ణయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఎంఎస్పీకి చట్టపరమైన హామీని కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన వాగ్ధానాలను నిలబెట్టుకోవాలని సూచించారు. మరికొందరు ఎంపీలు సైతం ఈ అంశంపై మాట్లాడాలని పట్టుబట్టగా చైర్మన్ అనుమతించకపోవడంతో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా, ఏడాది కాలంగా రైతులు నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడం లేదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు ఈ అంశంపై చర్చించాలని డిమాండ్ చేయడం గమనార్హం.