Vivek Oberoi:‘ఎవరో మధ్యవర్తుల లాబీయింగ్ మన ఫ్యూచర్‌ను నిర్ణయించడమేంటి..?’:అగ్ర నటుడు

by Anjali |
Vivek Oberoi:‘ఎవరో మధ్యవర్తుల లాబీయింగ్ మన ఫ్యూచర్‌ను నిర్ణయించడమేంటి..?’:అగ్ర నటుడు
X

దిశ, వెబ్‌డెస్క్: అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి.. ప్రేక్షకులను మెప్పించాడు ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్(Bollywood actor Vivek Oberoi). ఈ హీరో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు విషయాలు వెల్లడించారు. ఈయన నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీసు వద్ద రికార్డు క్రియేట్ చేశాయి. కానీ ఓ దశలో సినిమా అవకాశాలు రాక పదిహేను నెలలు ఇంట్లో ఖాళీగానే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. 22 ఏళ్లలోనే తను 67 సినిమాల్లో నటించానని, వీటిలో చాలా వరకు విజయం సాధించినవే ఉన్నాయని అన్నారు. మనం ఎంత బాగా యాక్ట్ చేసి సినీ ప్రేక్షకుల మెప్పు పొందినప్పటికీ.. కొన్నిసార్లు సమయం మనకు అనుకూలించదని తెలిపారు.

2007 లో నేను నటించిన ‘షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా’(Shootout at Lokhandwala) చిత్రంలో నటించాక.. తర్వాత మంచి సినిమా అవకాశాలు వస్తాయి కావచ్చని భావించానన తెలిపారు. ఎందుకంటే ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని పేర్కొన్నారు. కానీ ఈ మూవీ అనంతరం ఒక్క సినిమాలో కూడా అవకాశం రాకపోవడంతో దాదాపు ఏడాదిపైగే ఇంట్లో కూర్చున్నానని వెల్లడించారు. నటనపై ఆసక్తితోనే సినీ ఇండస్ట్రీకి వచ్చాను.. కానీ ఎవరో మధ్యవర్తుల లాబీయింగ్(lobbying) మన ఫ్యూచర్‌ను డిసైడ్ చేయడమేంటి? అన్నారు. ఆ సిచ్యూవేషన్ ను నేను కోరుకోవట్లేదని.. కాగా బిజినెస్ చేయాలని నిర్ణయించుకుని.. ఆ రంగంలోని దిగానని తెలిపారు. దీంతో ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వడానికి మాత్రం బాగా మేలు జరిగిందని వివేక్ ఒబెరాయ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story