- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu:‘గన్ను పెట్టి వాటాలు లాక్కుంటారా?’.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: అధికారం ఉందని గన్ను పెట్టి ఆస్తులు రాయించుకోవడం ఎక్కడా చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇలా వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు చరిత్రలో లేవన్నారు. ఇటువంటి కొత్త తరహా నేరాల పట్ల ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుందని తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియాతో చంద్రబాబు ఇష్టాగోష్టి గా మాట్లాడారు. కాకినాడ పోర్టు సెజ్ లలో బలవంతంగా వాటాలు రాయించుకున్న వ్యవహారంపై సీఎం ఆరా తీశారు. బలవంతపు వాటాల అంశం ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి వస్తుందేమో చూడాలన్నారు. అవినీతి విన్నాం.. వ్యాపారాల్లో వాటాలు లాక్కోవడం ఇప్పుడే చూస్తున్నామని పేర్కొన్నారు. తుపాకీ చూపించి మరి ఆస్తుల్లో వాటాలు లాక్కోవడం ముందు ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ముంబై మాఫియా బృందాలు లాక్కునే ఆస్తులను ప్రభుత్వం సీజ్ చేసే చట్టంపై సీఎం ఆరా తీశారు. ఆస్తులను సీజ్ చేసే చట్టం ఎక్కడెక్కడ ఉందనే విషయం పై సమాచారం తెప్పించుకుంటామన్నారు. ఆస్తులను పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమ పై ఉందని సీఎం తెలిపారు.
తమ భూ వివాదాల ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని సీఎం తెలిపారు. వాటికి పరిష్కారం చూపకుండా అధికారులు ఫిర్యాదును మరో చోటికి బదిలీ చేయడం సరికాదన్నారు. ఫిర్యాదును తన సీటు నుంచి మరొక సీటుకు బదిలీ చేయడమే పరిష్కారం కాదన్నారు. ఫిర్యాదుదారుడికి పరిష్కారం చూపించేలా కసరత్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.. 2019 తర్వాత న్యాయబద్ధ అమ్మకాలు, కొనుగోలను తప్పు పట్టలేమని, వాటి జోలికి వెళ్ళబోమని తెలిపారు. ఈ నెలలో జరిపే రెవెన్యూ సదస్సుల తర్వాత కొంత స్పష్టత వస్తుందని సీఎం పేర్కొన్నారు. కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వచ్చిందన్నారు. ఏ సమస్య దీని పరిధిలోకి వస్తుందో అర్థం కాని పరిస్థితి తెచ్చారని ఆరోపించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూనే రోజువారీ కార్యక్రమాలు చేపడతామని సీఎం అన్నారు. జగన్ టైం లో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై అధ్యయనం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒప్పందాలు రద్దు చేస్తే జరిమానా కట్టాల్సి వస్తుందన్నారు. అన్ని వైపులా ఆలోచించి వేరేది వేస్తున్నామని తెలిపారు. రాజధానిలో ఓ ఇంటి వారు అవుతున్నారు అని మీడియా అడగ్గా అది మా ఇంటి హోం మంత్రి చూసుకుంటున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణాన్ని మాత్రమే తాను చూస్తున్నానని సీఎం తెలిపారు . ఇంటి నిర్మాణం మా కుటుంబం చూసుకుంటుంది అన్నారు.
రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ ఇదే..
రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షెడ్యుల్‌ను ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి 2025 జనవరి 8 వరకూ వీటిని నిర్వహించనున్నారు. గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి, 22A, ఫ్రీ హోల్డ్, భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులను సర్కార్ స్వీకరించనుంది. ఇందులో భాగంగా గ్రామ, మండల స్థాయి, జల్లా స్థాయిలో రెవెన్యూ సదస్సుల షెడ్యుల్‌ను ప్రకటించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఫిర్యాదుల స్వీకరణ ..
ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చేరుకున్నారు. ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. స్థానిక నేతలతో మాట్లాడారు. కృష్ణా జిల్లా పామర్రు, పెనమలూరులో రైతు భరోసా కేంద్రాల్లో జరిగిన అవకతవకలు స్థానిక నేతలు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. లారీల్లో ఎక్కువ ధాన్యం బస్తాలు లోడ్ చేస్తూ రికార్డులు తక్కువ చూపిస్తున్న వైనంపై చంద్రబాబు ఆరా తీశారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ధ్యానం కొనుగోళ్లు వెంటనే చేపట్టేందుకు వాట్సప్ ద్వారా నమోదు పద్ధతిని తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. అందులో రిజిస్టర్ కాగానే ఐ విఆర్ఎస్ మెసేజ్ వెళుతుంది అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై తనిఖీలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.