- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Meesho: రిటర్న్‌ల పేరుతో మీషోను రూ. 5.5 కోట్లు మోసం చేసిన సైబర్ మోసగాళ్లు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ ధోరణి పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. సాధారణంగా ఈ-కామర్స్ కంపెనీలు కొన్న వస్తువులను రిటర్న్ చేసే సదుపాయాన్ని అందిస్తుంటాయి. అయితే, దీన్ని అవకాశంగా మార్చుకున్న సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. తాజా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మీషోను సైబర్ మోసగాళ్లు రూ. 5.5 కోట్లకు పైగా మోసం చేశారు. మోసగాళ్లు ఫేక్ సెల్లర్‌గా మీషోలో నకిలీ ఖాతాలను ఉపయోగించి ఆర్డర్లు చేచేశారు. మీషో నుంచి వచ్చిన నాణ్యమైన వస్తువులను తీసుకుని, రిటర్న్ పేరుతో నకిలీ వాటిని తిరిగి ఇచ్చారు. దానికి సంబంధించి వీడియోను చూపించి రీఫండ్లను పొందారు. ఇలా ఈ ఏడాది జనవరి-జూలై మధ్య రూ. 5.5 కోట్ల వరకు దొంగలించారు. దీనికి సంబంధించి మీషో నోడల్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. నిందితులు సూరత్‌లో 'ఓఎం శ్రీ ఎంటర్‌ప్రైజెస్' పేరుతో కంపెనీని స్థాపించి నకిలీ పేర్లు, చిరునామాలతో ఆర్డర్లు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. మిగిలిన వారి కోసం విచారణ చేపడుతున్నట్టు వెల్లడించారు.