- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Startups: భారీ ప్యాకేజీతో నియామకాలు చేపడుతున్న స్టార్టప్‌లు, ఈ-కామర్స్ కంపెనీలు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో అనేక స్టార్టప్‌లు, ఈ-కామర్స్ కంపెనీలు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని భావిస్తున్నాయి. దీనికోసం ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీల్లో నియామక ప్రక్రియను ప్రారంభించినట్టు తెలుస్తోంది. వ్యాపార వృద్ధితో పాటు నిధుల సేకరణకు పెరుగుతున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఆఫర్ ఇస్తున్న కంపెనీల్లో జొమాటో, ఫ్లిప్‌కార్ట్, ఓలా, మీషో, గేమ్స్‌కార్ట్, హైల్యాబ్స్, మింత్రా, ఫోన్‌పె, క్విక్‌సెల్, గ్రో, కార్స్24, నోబ్రోకర్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇవి ఎన్ఐటీ, బిర్లా టెక్నాలజీ అండ్ సైన్స్ పిలానీ, వివిధ ఐఐటీ క్యాంపస్‌లలో నియామకాలను చేపడుతున్నాయి. ప్రధానంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, ప్రోడక్ట్ అనలిటిక్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి విభాగాల్లో ఎక్కువ నియామకాలను చేపడుతున్నాయి. నియామకాలను చేపడుతున్న కంపెనీల సంఖ్యతో పాటు ఆయా కంపెనీలు ఎక్కువ మందిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. వివిధ ఇన్‌స్టిట్యూట్‌లు అందించిన వివరాల ప్రకారం.. కంపెనీలు ఉద్యోగులకు కనిష్టంగా రూ. 8-12 లక్షల నుంచి రూ. కోటి వరకు ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నాయి.