- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi : 90వేల మంది కార్మికులకు రూ.8వేలు చొప్పున ఆర్థికసాయం
దిశ, నేషనల్ బ్యూరో : తీవ్ర వాయు కాలుష్యం కారణంగా నవంబరు 18 నుంచి దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో నిర్మాణ పనులపై బ్యాన్ అమల్లో ఉంది. దీంతో ఉపాధిని కోల్పోతున్న 90వేల మందికిపైగా రిజిస్టర్డ్ నిర్మాణరంగ కార్మికుల(construction workers)కు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. వారందరికీ రూ.8వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించింది. ‘బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్’ చట్టం -1996 ప్రకారం పేర్లను నమోదు చేసుకొని, 2024 నవంబరు 25 నాటికి క్రియాశీలక సభ్యత్వం కలిగిన నిర్మాణ రంగ కార్మికులు ఈ ఆర్థికసాయాన్ని పొందేందుకు అర్హులు.
90వేల మందికిపైగా కార్మికుల ఫోన్ నంబర్లకు ఇప్పటికే ‘ఢిల్లీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్’ నుంచి వెరిఫికేషన్ లింకులతో మెసేజ్‌లు వెళ్లాయి. వారంతా ఆ వెరిఫికేషన్ లింకుల ద్వారా అన్ని డాక్యుమెంట్స్‌ను సమర్పించాల్సి ఉంది. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక.. ఆయా కార్మికులకు చెందిన ఆధార్ లింక్డ్ బ్యాంకు అకౌంట్లలోకి రూ.8వేల ఆర్థికసాయాన్ని నేరుగా బదిలీ చేస్తారు.