- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ vs ఆప్.. స్పందించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియా కూటమి విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కమిట్మెంట్‌తో ఉందని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పంజాబ్‌లో ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్ కావడంపై విపక్ష ఇండియా కూటమిలో పార్టీల మధ్య పొసగడం లేదనే చర్చ జరుగుతున్నది. పంజాబ్ పోలీసులు డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్ పాల్ సింగ్ ఖైరాను అరెస్ట్ చేయడమే ఇందుకు ఉదాహరణ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో శుక్రవారం స్పందించిన కేజ్రీవాల్ డ్రగ్స్ సుఖ్ పాల్ అరెస్ట్ గురించి నేను విన్నాను. అయితే ఈ అంశానికి సంబంధించిన వివరాలు నా వద్ద లేవు. అయితే పంజాబ్ లో డ్రగ్స్ సమస్యను రూపుమాపేందుకు భగవంత్ మాన్ ప్రభుత్వం పని చేస్తోంది. ఈ పోరాటంలో ఎవరినీ విడిచిపెట్టదు. ఇదే సమయంలో ఇండియా కూటమితో ఆప్ కలిసి ఉందని చెప్పారు.
Advertisement
Next Story