- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi High Court : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎవరైనా జైలుకు వెళ్లారా?
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓల్డ్ రాజేంద్రనగర్ కోచింగ్ సెంటర్ ఘటనపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు స్వీకరించింది. విచారణ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సహా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్బన్ ప్లానింగ్ లోపాలపై వివరణ కోరుతూ ఛైర్మన్ కు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా డ్రైనేజీలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను శుక్రవారం లోగా కూల్చివేయాలని ఆదేశించింది. తాత్కాలిక సీజేఐ జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆప్ పై విమర్శలు గుప్పించింది. ఢిల్లీ ప్రభుత్వంపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచితాల సంస్కృతి వల్ల పన్నులు కట్టరని.. అప్పుడే ఇలాంటి దారుణాలు జరుగుతాయంది. "ప్రకృతితో.. భవనాలతో.. పోరాడగలం అనుకుంటే పొరపాటే. ఈ ప్లానింగ్ ఏంటి? ఒకరోజు కరువు అని.. మరొసటి రోజు వరదలు అని మొరపెట్టుకోవడం ఏంటి?" అని ప్రశ్నించింది.
ఎంసీడీ నుండి ఎవరైనా జైలుకు వెళ్లారా?
సీనియర్ ఎంసీడీ సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని హైకోర్టు పోలీసులను అడిగింది. "ఆజ్ఞలను పాటించాల్సిన అవసరం లేదని మీ అధికారులు విశ్వసిస్తున్నట్లుంది" అని ఎంసీడీకి చురకలు అంటించింది. “మీరు జూనియర్ అధికారులను తొలగించారు.. అయితే వారి పనిని పర్యవేక్షించాల్సిన సీనియర్ అధికారుల సంగతేంటి? ఎంసీడీ నుండి ఎవరైనా జైలుకు వెళ్లారా? కొన్ని సమయంలో సీనియర్ అధికారులు తప్పనిసరిగా సైట్ ని సందర్శించాలి. కానీ, వారు తమ ఎయిర్ కండిషన్డ్ కార్యాలయాలను వదిలి వెళ్లడం లేదు" అని కోర్టు ఫైర్ అయ్యింది. దర్యాప్తు సరిగ్గా చేయకుంటే కేసును కేంద్ర ఏజెన్సీకి బదిలీ చేస్తామని పోలీసులను హెచ్చరించింది. తదుపరి విచారణను శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.