- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో తుపాను బీభత్సం..ఇద్దరు మృతి, 23 మందికి గాయాలు
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో దుమ్ము తుపాను బీభత్సం సృష్టించింది. ఢిల్లీ ఎన్సీఆర్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్టు తెలుస్తోంది. ఈ బలమైన గాలుల కారణంగా పలు భవనాలు దెబ్బతినడంతో పాటు అక్కడక్కడ చెట్లు నేలకొరిగాయి. దీంతో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంతేగాక పలు చోట్ల విద్యుత్ కు సరఫరా నిలిచిపోయింది. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీకి వెళ్లే 9 విమానాలను ఎయిర్ పోర్టు అధికారులు జైపూర్‌కు మళ్లించారు. ఢిల్లీ పోలీసులకు చెట్లకు సంబంధించి 152 కాల్స్, భవనాలకు సంబంధించిన 55, విద్యుత్తు అంతరాయం గురించి 202 కాల్స్ వచ్చినట్టు తెలిపారు. నోయిడాలోని సెక్టార్ 58లో భవనాన్ని రిపేర్ చేయడానికి ఏర్పాటు చేసిన షట్టరింగ్ వాహనాలపై పడడంతో అనేక కార్లు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న రెస్య్కూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఢిల్లీలో శనివారం ఉదయం సైతం తేలిక పాటి వర్షం కురిసింది. దీంతో తీవ్ర ఉష్ణోగ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్టైంది
అయితే ఉరుములు, మెరుపులతో కూడిన మరిన్ని వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, కర్ణాటక, కేరళలోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దేశంలోని 7 రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. శుక్రవారం రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లో శనివారం హీట్ వేవ్ హెచ్చరికను జారీ చేశారు.