ప్రధాని మోడీ 8 కోట్ల కొత్త ఉద్యోగాల వ్యాఖ్యలపై మరోసారి కాంగ్రెస్ కౌంటర్

by S Gopi |
ప్రధాని మోడీ 8 కోట్ల కొత్త ఉద్యోగాల వ్యాఖ్యలపై మరోసారి కాంగ్రెస్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: గడిచిన 3-4 ఏళ్లలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పించామని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఇంకా విమర్శలను కొనసాగిస్తూనే ఉంది. సోమవారం సైతం ఉద్యోగాల కల్పన విషయంలో మోడీ ప్రభుత్వం 'తెలివైన అంకెల గారడీ' చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. 'భారత్ తీవ్రమైన మోడీ ప్రభావిత నిరుద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ ప్రతి ఉద్యోగానికి లక్షలాది మంది యువకులు దరఖాస్తు చేస్తున్నారు. స్వీయ అభిషిక్త నాన్-బయోలాజికల్ ప్రధాని తనకు తెలిసింది మాత్రమే మాట్లాడే పనిలో బిజీగా ఉన్నారు. తనకు పేటెంట్ ఉన్న తిరస్కరించడం, దృష్టి మరల్చడం, వక్రీకరించడం అనే 3డీ మోడల్‌ను అమలు చేయడం మాత్రమే తెలుసునని ' జైరాం రమేష్ ఆరోపణలు చేశారు. ఉద్యోగాలకు సంబంధించి వాస్తవాలు భయానకంగా ఉన్నాయి. అధిక నిరుద్యోగం, తక్కువ నాణ్యత కలిగిన ఉపాధి అంశాలను వచ్చే మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో ఉద్దేశపూర్వకంగా మోడీ ప్రభుత్వం విస్మరిస్తుందని ఆయన తెలిపారు. ఉపాధి, సంబంధిత పరిస్థితులపై శ్రద్ధ చూపకుండా ఉద్యోగాల సృష్టిపై ప్రభుత్వం తెలివైన అంకెల గారడి చేసిందని జైరాం రమేష్ వెల్లడించారు.

Advertisement

Next Story