- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కర్ణాటకలో కాంగ్రెస్ నేత కుమార్తె హత్య.. లవ్ జిహాద్ ఆరోపణలు..!
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని హుబ్బెళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య రాజకీయ దుమారం రేపింది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎంసీఏ చదువుతున్న 23 ఏళ్ల యువతిని అదే కాలేజీకి చెందిన సీనియర్ ఫయాజ్ ఖోండునాయక్ దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన మొత్తం కాలేజ్ క్యాంపస్‌లోనే జరిగింది. యువతితో తాను రిలేషన్ లో ఉన్నాడని విచారణలో భాగంగా నిందితుడు చెప్పాడు. దీంతో ఈ ఘటన రాజకీయంగా వివాదాస్పదం అయ్యింది.
అధికార కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యక్తిగత కోణంగా చూపిస్తుందని.. కర్ణాటకలో శాంతిభద్రతలు క్షీణించిపోయాయని బీజేపీ మండిపడింది. ఈ ఘటన వెనుక లవ్ జిహాద్ కోణం ఉందని కేంద్ర మంత్రి, ధార్వాడ్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ జోషి అనుమానం వ్యక్తం చేశారు. . కేంద్రమంత్రి మీనాక్షి లేఖి కూడా కర్ణాటక ప్రభుత్వంపై విమర్శుల గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలోనే అవినీతి, నేరం, మతహింస ఉందని చెప్పారు. చట్టం, యంత్రాగం తప్పు చేసేవారిని శిక్షించేలా చూస్తుందని ప్రజలకు నమ్మకం ఉండాలని.. కానీ, ఈ విషయంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని అన్నారు. అయితే, కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర ఇందులో లవ్ జిహాద్ కోణం లేదని చెప్పాడు.
మరోవైపు బాధిత యువతి తండ్రి కాంగ్రెస్ కార్పొరేటర్ మాత్రం తన బిడ్డ హత్యకు కారణం లవ్ జిహాద్ అని పేర్కొనడం సంచలనంగా సృష్టించింది. యువతి తండ్రి నిరంజన్ హిరేమత్ మీడియాతో మాట్లాడుతూ.. తన కూతురిని ట్రాప్ చేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు. ఈ ముఠా చాలా కాలంగా కుట్ర పన్నుతోందని, తన బిడ్డను ట్రాప్ చేయాలని అనుకున్నారని, అందులో భాగంగానే ఆమెను బెదిరించాలని పేర్కొన్నాడు. వాళ్ల బెదిరింపులకు భయపడకపోవడంతో తన కుమార్తెను హత్య చేశారని ఆరోపించారు. తన కూతురికి ఏమైందో రాష్ట్రం, దేశం మొత్తం చూసిందన్నారు. వాళ్లు పర్సనల్ అని చెబుతున్నారని.. ఇందులో పర్సనల్ ఏం ఉంటుంది.. వారిద్ధరు బంధువులా..? అని ఆయన ప్రశ్నించారు.
అయితే కర్ణాటకలో శాంతిభద్రతలు బాగున్నాయని, గవర్నర్ పాలన విధించేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. మరోవైపు హుబ్బెళ్లిలోని విద్యానగర్ పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీతో పాటు రైట్ వింగ్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.