- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మమతా బెనర్జీని నమ్మకూడదు: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్
దిశ, నేషనల్ బ్యూరో: మమతా బెనర్జీపై పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను గౌరవించాలనుకుంటే ఆయనను రాజ్యసభకు పంపించి ఉండాల్సిందని అన్నారు. తాజాగా టీఎంసీ 42 మందితో లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, యూసుఫ్ పఠాన్‌ను బెర్హంపూర్ నుంచి రంగంలోకి దించింది. అయితే ఈ స్థానం నుంచి అధిర్ రంజన్ ఐదు సార్లు ఎంపీగా గెలిచారు. అదే స్థానం నుంచి పఠాన్‌ను పోటీకి దింపడంతో మమతా బెనర్జీపై రంజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి సహాయం చేయడానికి పఠాన్‌ను ఎంపిక చేశారు. మమతా బెనర్జీని ఇతర రాజకీయ పార్టీలు నమ్మకూడదని దీనికి టీఎంసీ అభ్యర్థుల జాబితాయే నిదర్శనమని అన్నారు. తాను ఇండియా కూటమిలో కొనసాగితే ప్రధాని మోడీ అసంతృప్తి చెందుతారనే భయంతో మమతా బెనర్జీ ఉన్నారు. తనకు తానుగా కూటమి నుంచి వేరుగా ఉండటం ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా ఉండటం లేదని PMOకి సందేశం పంపుతున్నారని అధిర్ రంజన్ ఆదివారం అన్నారు.