- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుజరాత్ లో దశాబ్దకాలం తర్వాత ఖాతా తెరిచిన కాంగ్రెస్
దిశ,నేషనల్ బ్యూరో: గుజరాత్ లో కాంగ్రెస్ ఎట్టకేలకు ఒక్క సీటు గెలుచుకుంది. దాదాపు దశాబ్దకాలం తర్వాత కాంగ్రెస్ కు సీటు దక్కింది. గుజరాత్ లోని 26 స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ చూసింది. కానీ, బనస్కాంత నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జెనిబెన్ ఠాకూర్ గెలుపొంది.. ఆ రికార్డుని బ్రేక్ చేశారు. కౌంటింగ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే గుజరాత్ లోని 4 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కానీ, ఆతర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు వెనుకబడిపోయారు. బనస్కాంతలో మాత్రం జెనిబెన్ ఠాకూర్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రేఖా చౌదరిపై 30 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. బనస్కాంత పార్లమెంటు నియోజకవర్గంలో ఠాకూర్ కమ్యూనిటీ ప్రాబల్యం అధికంగా ఉంది. అలానే అట్టడుగు వర్గాల మద్దతు ఉండటంతో.. జెనిబెన్ ఠాకూర్ గెలుపొందినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
గత పదేళ్లుగా బీజేపీదే హవా
బనస్కాంత నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. 2019లో బీజేపీ అభ్యర్థి పర్బత్‌భాయ్ పటేల్ 3,68,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పార్థి భటోల్‌పై విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ బీజేపీ ఈ స్థానాన్ని విజయకేతనం ఎగురవేసింది. 2009లో మాత్రం గుజరాత్ లోని 26 స్థానాలకు గాను కాంగ్రెస్ 11, బీజేపీ 14 సీట్లు గెలుచుకున్నాయి.