- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మైసూర్ కింగ్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్..!
దిశ, నేషనల్ బ్యూరో: మైసూర్ కింగ్ యదువీర్ కృష్ణ దత్త చామరాజ వడియార్ పై ఈసీకి ఫిర్యాదు చేసింది కర్ణాటక కాంగ్రెస్. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొంది. కర్ణాటకలోని కొడగు లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మైసూర్ కింగ్ వడియార్. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘించి లంచం ఇచ్చారని ఈసీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్.
కర్నాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు కాంగ్రెస్ లేఖ రాసింది. వడియార్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించే చర్యలకు పాల్పడ్డారని పేర్కొంది. దీనివల్ల, ఎన్నికల ప్రక్రియకు, పారదర్శకతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొంది కాంగ్రెస్. తన ఎన్నికల ప్రచారానికి మద్దతు కావాలనే ఉద్దేశంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లతో సమావేశాన్ని వడియార్ నిర్వహించారు. రహస్యంగా నిర్వహించిన ఈ భేటీలో వారి కోసం పర్సనలైజ్డ్ నోట్ బుక్కులు, పెన్నులు, చాక్లెట్లు, చీరలు, స్వీట్స్ సహా.. వస్తువులను ఇచ్చినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు తనకు మద్దతు తెలిపేందుకు డబ్బులు పంపిణీ చేశారని లేఖలో పేర్కొంది కాంగ్రెస్.
ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కోరింది. ఎన్నికల కోడ్, ఎన్నికల చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంది. ఈ విషయంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు ప్రారంభించి సమగ్రంగా విచారణ చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరింది కాంగ్రెస్.