మహారాష్ట్రలో దుమారం రేగుతున్న శివాజీ విగ్రహ ఘటన.. సీఎం సంచలన ప్రకటన

by M.Rajitha |
మహారాష్ట్రలో దుమారం రేగుతున్న శివాజీ విగ్రహ ఘటన.. సీఎం సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : మూడు రోజుల కింద కుప్పకూలిన శివాజీ విగ్రహ ఘటన మహారాష్ట్రలో దుమారం రేపుతోంది. గత ఏడాది డిసెంబర్ 4న రాజ్ కోట్ వద్ద 35 అడుగుల శివాజీ భారీ విగ్రహం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరగగా.. ఏడాది కూడా గడవక ముందే అది కూలిపోయింది. ఈ ఘటనపై మహారాష్ట్ర విపక్షాలతోపాటు, అధికార పార్టీ కార్యకర్తలు కూడా భారీ నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్పిన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్.. బుధవారం ఓ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ నిరసనలు కొనసాగుతున్నాయి. కాగా ఈ ఘటనపై సీఎం ఏక్ నాథ్ షిండే స్పందించారు. శివాజీ విగ్రహం కూలిపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామన్న షిండే.. 100 సార్లు అయినా శివాజీ పాదాలు తాకి క్షమాపణ చెప్పేందుకు సిద్దం అన్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ దుర్ఘటన సంభవించిందని, ఇంత నిర్లక్ష్యంగా విగ్రహాన్ని తయారు చేసిన కాంట్రాక్టర్ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియ జేశారు.

Next Story

Most Viewed