తన భార్యను తానే చంపేశానంటూ పోలీసులకు ఫోన్..డెడ్ బాడీ కోసం వెతుకులాట

by Aamani |
తన భార్యను తానే చంపేశానంటూ పోలీసులకు ఫోన్..డెడ్ బాడీ కోసం వెతుకులాట
X

దిశ,పేట్ బషీరాబాద్: ఒక హత్య ఘటన సమాచారం కోసం గంటల తరబడి పోలీసులు వెతుకుతున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి వెంకన్న హిల్స్ రోడ్ నెంబర్ 1 లో మర్డర్ జరిగింది అని గుర్తు తెలియని వ్యక్తి నుండి పోలీసులకు శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో సమాచారం వచ్చింది. వెంటనే వెంకన్న హిల్స్ కి పోలీసులు చేరుకుని డెడ్ బాడీ కోసం వెతుకుతున్నారు. కానీ ఇప్పటివరకు ఘటన ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు. ఓ పక్క భారీ వర్షం కురుస్తున్నప్పటికీ పోలీసులు ఈ విషయంపై శోధిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి తన భార్యని చంపేశాను అంటూ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందని,దాని ఆధారంగానే పేట్ బషీరాబాద్ పోలీసులు వెంకన్న హిల్స్ కాలనీ లో తనిఖీలు చేస్తున్నారని సమాచారం. పేట్ బషీరాబాద్ సీఐ విజయవర్ధన్ నేతృత్వంలో హత్య జరిగిందా..? లేదా అనే విషయంపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరి మధ్య జరిగిన మాటల ద్వారానే..

అయితే ఈ విషయంపై పోలీసులు మరో రకంగా చెబుతున్నారు. వైన్ షాప్ వద్ద ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా మరో వ్యక్తి ఆ మాటలు విని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందని ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సమాచారం తెలిపిన ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ చేసింది ఎవరు..? అతని చిరునామా వంటి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed