- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అందరి ముందు అబ్బాయికి ప్రపోస్ చేసిన అమ్మాయి.. అతను ఏం చేశాడంటే..
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ప్రేమ జంటల్లో ముందుగా అబ్బాయిలే అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తూ ఉంటారు. కానీ నేటి కాలంలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం అనే మాట వినిపిస్తుంది. అలాగే అబ్బాయిని ప్రపోజ్ చేసే హక్కు అమ్మాయికి లేదా అని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాన్ని తెలిపే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసిన తీరు అక్కడ ఉన్నవారి హృదయాలను కదిలించింది. అంతే కాదు చాలా మంది అబ్బాయిలు ఆ ప్రేమికుడిని చూసి అసూయపడుతుండగా, మరి కొంతమంది మాత్రం మాకు ఇలాంటి లవర్ లేదే అని బాధపడుతున్నారు. అయినప్పటికీ వారిద్దరికీ శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఈ వీడియోలో ఓ పార్టీ దృశ్యం ఉంది. ఇది ఏదో వీడ్కోలు కార్యక్రమంలా ఉంది. ఇక్కడ అందమైన ఎర్రటి చీరలో ఒక అమ్మాయి కుర్చీ పై కూర్చున్న అబ్బాయి చేతిని పట్టుకుని అందరి మధ్యలోకి తీసుకువస్తుంది. “జరా సి దిల్ మే జచా బనా తూ..” అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంది. అయితే ఆ అమ్మాయి తన స్నేహితులందరి మధ్య అబ్బాయిని తీసుకెళ్లి మోకాళ్ల పై కూర్చొని పువ్వులు ఇస్తూ ప్రపోజ్ చేయడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
సమీపంలో నిలబడి ఉన్న స్నేహితులు కూడా సంతోషంగా కనిపిస్తారు. వారిద్దరినీ చాలా ఉత్సాహపరుస్తారు. దీని తర్వాత అమ్మాయి లేచి నిలబడిన తర్వాత అబ్బాయి ఆమెను కౌగిలించుకున్నాడు. అక్కడ ఉన్నవారు స్నేహితులు చప్పట్లు కొట్టడం ప్రారంభిస్తారు. ఈ దృశ్యం మొత్తం సినిమా దృశ్యంలా కనిపిస్తుంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో rudrarup_de ఖాతాతో భాగస్వామ్యం చేశారు.
Video credits by rudrarup_de