Breaking News: సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అమిత్ గార్గ్ నియామకం

by Maddikunta Saikiran |
Breaking News: సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అమిత్ గార్గ్ నియామకం
X

దిశ, వెబ్‌డెస్క్:హైదరాబాద్‌(Hyderabad)లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ(SVPNPA) డైరెక్టర్‌గా అమిత్ గార్గ్(Amit Garg) నియమితులయ్యారు.1993 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌(Andhra Pradesh cadre)కు చెందిన గార్గ్ 2027 అక్టోబర్ 31 వరకు పదవిలో ఉంటారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ(SVPNPA) భారతదేశంలోని పౌర సేవా శిక్షణా సంస్థ. ఈ సంస్థ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారులను వారి విధులను నిర్వహించడానికి వారి సంబంధిత రాష్ట్ర కేడర్‌లకు పంపే ముందు వారికి శిక్షణ ఇస్తుంది. ఈ అకాడమీ తెలంగాణ(Telangana) రాష్ట్రం హైదరాబాద్(Hyderabad)లోని శివరాంపల్లి(Shivarampalli)లో ఉంది. అలాగే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) డైరెక్టర్‌గా 1991బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి అలోక్ రంజన్(Alok Ranjan) నియమితులయ్యారు.మధ్యప్రదేశ్ కేడర్‌(Madhya Pradesh cadre)కు చెందిన రంజన్ జూన్ 30, 2026 వరకు ఈ పదవిలో ఉంటారు.

వీరితో పాటు 1993 బ్యాచ్‌ ఐపీఎస్ ఆఫీసర్లు రిత్విక్ రుద్ర(హిమాచల్ ప్రదేశ్ క్యాడర్), మహేశ్ దీక్షిత్(ఆంధ్రప్రదేశ్ క్యాడర్), ప్రవీణ్ కుమార్(పశ్చిమ బెంగాల్ కేడర్) , అరవింద్ కుమార్(బీహార్ క్యాడర్) ఇంటెలిజెన్స్ బ్యూరోలో అదనపు డైరెక్టర్లుగా నియమితులయ్యారు.అలాగే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) డైరెక్టర్ జనరల్‌గా 1993 బ్యాచ్ IPS అధికారి ప్రవీర్ రంజన్ నియమితులయ్యారు.ప్రవీర్ రంజన్ ప్రస్తుతం CISF యొక్క అదనపు డైరెక్టర్ జనరల్ (ADG)గా ఉన్నారు.వీరి నియామకాలకు క్యాబినెట్ నియామకాల కమిటీ(The Appointments Committee of the Cabinet) శనివారం ఆమోదం తెలిపింది.

Next Story

Most Viewed