శ్రీవారి లడ్డూ అపవిత్రంపై అనుమానాలు.. నివృత్తి చేస్తూ టీటీడీ పోస్ట్‌

by srinivas |   ( Updated:2024-09-21 17:05:15.0  )
శ్రీవారి లడ్డూ అపవిత్రంపై అనుమానాలు.. నివృత్తి చేస్తూ టీటీడీ పోస్ట్‌
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి లడ్డూ (Tirumala Srivari Laddu) తయారీలో వినియోగించిన నెయ్యి (Ghee)లో జంతువుల అవశేషాలున్నాయని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే లడ్డూ వ్యహారంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాష్ట్రం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అప్రమత్తమైంది. శ్రీవారి లడ్డూ వివాదంపై స్పందించింది. లడ్డూ అపవిత్రంపై వెల్లువెత్తిన అనుమానాలను నివృత్తి చేసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల పవిత్రతను పునరుద్ధరించామంటూ ఎక్స్‌లో టీటీడీ పోస్ట్‌ చేసింది. గతంలో ఉపయోగించిన నెయ్యి, ప్రస్తుతం వినియోగిస్తున్న నెయ్యి వివరాలు వెల్లడించింది. నెయ్యి కల్తీని నిర్ధారించిన ల్యాబ్‌ రిపోర్ట్‌తో పాటు నందిని డెయిరీ నెయ్యి ల్యాబ్‌ నివేదికను కూడా పక్కనే పోస్టు చేసింది. లడ్డూల ప్రస్తుత నాణ్యతపై భక్తుల్లో అపోహలు లేకుండా టీటీడీ నివృత్తి చేసింది.

Advertisement

Next Story

Most Viewed