Ramnath Kovind: తిరుపతి లడ్డూ కల్తీ మహా పాపం : మాజీ రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు

by Shiva |
Ramnath Kovind: తిరుపతి లడ్డూ కల్తీ మహా పాపం : మాజీ రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి (Tirupati) లడ్డూ కల్తీ వ్యవహారం మహా పాపమని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Former President Ram Nath Kovind) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు ఇచ్చే ప్రసాదంలో కల్తీ జరిగిందనే వార్త తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని తెలిపారు. హిందువులకు తీర్థ ప్రసాదాల మీద అపార నమ్మకం ఉంటుందని, అలాంటి వాటిలో కూడా అవకతవకలకు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. దేశంలో అనేక ఆలయాల్లో ఇలాంటి సమస్యలే తాండవిస్తున్నాయని ఆరోపించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని వదిలిపెట్టకూడదని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ (Comprehensive investigation)కు ఆదేశించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సూచించారు.

Next Story

Most Viewed