కునో పార్కు నుంచి బయటకొచ్చిన చీతా

by S Gopi |
కునో పార్కు నుంచి బయటకొచ్చిన చీతా
X

భోపాల్: కేంద్రం ప్రతిష్టాత్మకంగా నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలలో ఒకటి మధ్యప్రదేశ్‌లోని కునో పార్కును వీడింది. పార్కు నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి సమీపంగా వెళ్లినట్లు ఆదివారం అధికారులు తెలిపారు. ఒబాన్ అనే చీతా మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని బరోడా గ్రామంలోని పంట పొలాల్లో సంచరిస్తున్నట్లు చెప్పారు. చీతా మెడకు అమర్చిన పరికరం ద్వారా పార్కు నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించామన్నారు. శనివారం రాత్రే అటువైపుగా పోయిందని తెలిపారు. అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేశారని, చీతాను తిరిగి అడవిలోకి పంపే ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. గత నెల 27న సాశ అనే చీతా అనారోగ్యంతో మరణించిన సంగతి తెలసిందే. ఆ తర్వాత సిజయ అనే చీతా నాలుగు కూనలకు జన్మనిచ్చినట్లు వీడియోలు వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed