Champai Soren : ఆగస్టు 30న బీజేపీలోకి చంపై సోరెన్

by Hajipasha |
Champai Soren : ఆగస్టు 30న బీజేపీలోకి చంపై సోరెన్
X

దిశ, నేషనల్ బ్యూరో : సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ఇటీవలే ప్రకటించిన జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ అనూహ్యంగా నిర్ణయం మార్చుకున్నారు. బీజేపీలో చేరాలని ఆయన డిసైడయ్యారు. శుక్రవారం రోజు(ఆగస్టు 30న) కమలదళంలోకి చంపై సోరెన్ చేరుతారని అసోం సీఎం, బీజేపీ జార్ఖండ్ వ్యవహారాల కో ఇన్‌ఛార్జి హిమంత బిస్వ శర్మ ప్రకటించారు.

ఈవిషయాన్ని తెలుపుతూ ఆయన ఎక్స్ వేదికగా సోమవారం అర్ధరాత్రి ఒక పోస్ట్ చేశారు. సోమవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ తర్వాత బీజేపీలో చేరాలని చంపై సోరెన్ నిర్ణయించుకున్నారని అసోం సీఎం వెల్లడించారు.

Advertisement

Next Story