Parliament : నవంబర్ 26న పార్లమెంటు ఉభయసభల ప్రత్యేక సమావేశం

by Shamantha N |
Parliament : నవంబర్ 26న పార్లమెంటు ఉభయసభల ప్రత్యేక సమావేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: నవంబర్ 26న పార్లమెంటు ఉభయసభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన పార్లమెంటు సెంట్రల్ హాల్లోనే ఉభయసభల సభ్యులు సమావేశమవుతారు. రాజ్యాంగానికి ఆమోదం లభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ ఆర్టికల్స్‌, చట్టాల్లో జరిగిన మార్పులు, చేర్పుల గురించిన విషయాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కాగా గతంలో నవంబర్ 26ని జాతీయ న్యాయదినోత్పవంగా నిర్వహించే వారు. అయితే 2015లో అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని ఆ రోజును రాజ్యాంగ దినోత్సవంగా మార్చారు. కాగా.. వచ్చే ఈసారి మన రాజ్యాంగం ఆమోదం పొంది సరిగ్గా 75 ఏళ్లు పూర్తవుతుంది. అందుకోసమే, ఆ రోజున పార్లమెంట్‌ ఉభయసభలను ప్రత్యేకంగా సమావేశపర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Next Story

Most Viewed