- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manipur Violence : మణిపూర్ హింసపై కేంద్రం సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని నిర్ణయించింది. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వనున్నారు. కాగా, మణిపూర్‌లో రెండు తెగల మధ్య చెలరేగిన అల్లర్లు ఘోరాతి ఘోర దారుణాలకు దారితీశాయి. దాదాపు మూడు నెలలుగా రాష్ట్రం అట్టుడికిపోతోంది. ముఖ్యంగా మే 4న ఓ గ్రామంలో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక లైంగికదాడికి పాల్పడిన దృశ్యాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి.
పోలీసుల వద్ద ఉన్న బాధితులను దాదాపు వెయ్యిమంది మైతీలు బలవంతంగా లాక్కెళ్లి నగ్నంగా మార్చి ఊరేగించిన దృశ్యాలను చూసి 140 కోట్ల మంది భారతీయులు చలించిపోతున్నారు. దేశ ఆగ్రహాన్ని గమనించిన ప్రధాని మోడీ ఎట్టకేలకు గురువారం స్పందించారు. ఈ సందర్భంగా బాధితులకు సానుభూతి తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటన చేశారు. అంతేగాక, ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం చేసింది. వీడియోను సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.