- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటితో ముగియనున్న మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ కేసులో ఆయన వారం రోజులు సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కోర్టు అనుమతించిన కస్టడీ ముగియడంతో మధ్యాహ్నం రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు మనీష్ సిసోడియాను హాజరుపరచనున్నారు. గతనెల 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
27న కోర్టులో హాజరుపరిచిన సీబీఐ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. తొలుత ఐదు రోజులు, తర్వాత మరో రెండు రోజులు సీబీఐ విచారణకు కోర్టు అనుమతించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన- అమలులో జరిగిన అక్రమాలు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా సిసోడియా తీసుకున్న నిర్ణయాలు, కనపడకుండా పోయిన ఫైల్స్, చేతులు మాటిన ముడుపులు, మద్యం వ్యాపారులకు అనుకూలంగా పాలసీ రూపకల్పన, నిందితులతో ఉన్న సంబంధాలపై సిసోడియాని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. మరి కొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని నేడు మరోసారి కోర్టును సీబీఐ కోరునుంది.