ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఢిల్లీ ఆర్డినెన్స్ పిటిషన్..

by Vinod kumar |
ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఢిల్లీ ఆర్డినెన్స్ పిటిషన్..
X

న్యూఢిల్లీ : ఢిల్లీలో పాలనాధికారాలపై నియంత్రణ కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఇంతకుముందు దీనిపై విచారణ జరిపిన రెండు రాజ్యాంగ బెంచ్‌లు పరిశీలించని న్యాయపరమైన అంశాలు ఈ పిటిషన్‌లో ఉన్నాయని.. అందుకే దీనిని విస్తృత ధర్మాసనానికి బదిలీచేస్తున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది.

కేంద్రం జారీ చేసిన ఢిల్లీ ఆర్డినెన్స్‌తో పాటు ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (డీఈఆర్‌సీ) చైర్మన్‌ ఎంపికపై దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ సందర్భంగా ఈ వివరాలను తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌లకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. డీఈఆర్‌సీ చైర్మన్‌ నియామకం విషయంలో అవి విఫలమయ్యాయని పేర్కొంది. డీఈఆర్‌సీని ఎవరూ పట్టించుకోకపోవడం విచారణకరమని పేర్కొంటూ.. చైర్మన్‌ను తామే ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed