ఐఎంఏ చీఫ్ పైన సుప్రీంకోర్టు ఆగ్రహం..!

by Shamantha N |
ఐఎంఏ చీఫ్ పైన సుప్రీంకోర్టు ఆగ్రహం..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ మెడికల్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు డా. ఆర్వీ అశోకన్‌ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించటంలో తాము అందిరికంటే ముందు ఉంటామని ధర్మాసనం పేర్కొంది. పతంజలి కేసులో సుప్రీంకోర్టు తీరుపై ఓ ఇంటర్వ్యూలో అశోకన్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ అమానుల్లా బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి నకిలీ ప్రకటనల కేసులో అశోకన్‌ పిటిషన్‌గా ఉన్నారని గుర్తుచేసింది.

అశోకన్ నుంచి మరింత బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు ఆశించామంది. కోర్టు తీర్పునకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని హితవు పలికింది. ఇలా హఠాత్తుగా మారటానికి కారణం ఏంటీ? అని అశోకన్ ను ప్రశ్నించింది. ఈ విషయంలో సుప్రీం కోర్టుకు అశోకన్‌ క్షమాపణలు తెలియజేశారు.

మీరు చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలను అంగీకరిస్తే.. మిమ్మల్ని కించపరిచారని కోర్టు ఆశ్రయించారని ఫైర్ అయ్యింది. అలాంటప్పుడు మీకు ఎలాంటి పరీక్ష పెట్టాలి?’ అని కోర్టు నిలదీసింది. క్షమాపణల అఫిడవిట్‌పై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బహిరంగంగా ఎందుకు క్షమాపణలు చెప్పలేదని ప్రశ్నించింది. నిజంగా క్షమాపణలు చెప్పాలనుకుంటే అఫిడవిట్‌ను ఎందుకు సరిదిద్దుకోలేదు? అని అడిగింది. ఇంటర్వ్యూ తర్వాత ఆ వ్యాఖ్యలను ఎలా సరిదిద్దుకున్నారో చెప్పాలని ప్రశ్నించింది ధర్మాసనం. భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించటంలో ముందుంటాం కానీ.. స్వీయ నియంత్రణ ఉండాల్సిన సందర్భాలు ఉంటాయని నొక్కిచెప్పింది.

స్వీయ నియంత్రణ ఉన్నట్లు ఆ ఇంటర్వ్యూలో కన్పించలేదని అశోకన్ ను ఉద్దేశించి అన్నారు జస్టిస్ హిమా కోహ్లి. జడ్జిలుగా విమర్శలు వస్తున్నా స్పందించమని అన్నారు మరో న్యాయమూర్తి జస్టిస్ అమానుల్లా. ఉన్నత స్థానంలో ఉన్నా.. తమకు వ్యక్తిగంతా అహం ఉండదని పేర్కొన్నారు. చాలా అరుదుగా మాత్రమే చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ విషయంలో ఉరట కల్పించాలని అశోకన్‌ తరుఫు న్యాయవాది కోరగా.. అశోకన్‌ ట్రాప్‌లో పడ్డారని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది కోర్టు. ఈ కేసుపై విచారణను సుప్రీం కోర్టు జూలై 9వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Next Story