- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cancer: దడపుట్టిస్తున్న తల, మెడ క్యాన్సర్లు
దిశ, నేషనల్ బ్యూరో : క్యాన్సర్ దడ పుట్టిస్తోంది. భారత్‌లో తల, మెడకు సంబంధించిన క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. క్యాన్సర్ నిర్ధారణ అవుతున్న 26 శాతం మందిలో తల, మెడ క్యాన్సర్లు బయటపడుతున్నాయని ఢిల్లీకి చెందిన ‘క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్’ అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 1,869 మంది క్యాన్సర్ రోగులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలను గుర్తించారు. శనివారం రోజు ‘ప్రపంచ తల, మెడ క్యాన్సర్ డే’ సందర్భంగా ఈ స్టడీ రిపోర్టును విడుదల చేశారు.
‘‘మార్చి 1 నుంచి జూన్ 30 మధ్యకాలంలో తమ హెల్ప్‌లైన్ నంబర్‌కు వచ్చిన కాల్స్ సమాచారాన్ని క్రోడీకరించి విశ్లేషించి తాము తల, మెడ క్యాన్సర్ల ముప్పుపై ఒక అంచనాకు వచ్చాం’’ అని క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ క్యాంపెయిన్‌కు సారథ్యం వహిస్తున్న సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. భారత్‌లో పెరిగిన పొగాకు వినియోగం, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ఇన్ఫెక్షన్ కారణంగా తల, మెడ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా యువకులు ఈ ముప్పును ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. పొగాకును నమలడం, ధూమపానం వల్లే దాదాపు 90 శాతం నోటి క్యాన్సర్లు వస్తున్నాయని ఆశిష్ పేర్కొన్నారు. తల,మెడ క్యాన్సర్లకు గల కారణాలపై స్పష్టత లేదన్నారు. అయితే ఆరోగ్యవంతమైన జీవనశైలి ద్వారా ఈ క్యాన్సర్ బారినపడకుండా ఉండొచ్చని ఆయన తెలిపారు.