- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎలక్టోరల్ బాండ్ల రద్దు సరైందే: నోబెల్ ప్రైజ్ విజేత అమర్య్తసేన్
దిశ, నేషనల్ బ్యూరో: ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ ప్రైజ్ విజేత అమర్త్యసేన్ స్వాగతించారు. ఎన్నికల ముందు ఈ తీర్పు ప్రజల్లో మరింత పారదర్శకతకు దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఆయన సోమవారం ఓ ఇంటర్యూలో మాట్లాడారు. ‘ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పెద్ద కుంభకోణం. దానిని రద్దు చేసినందుకు సంతోషిస్తున్నా. ఇది మరింత సుపరిపాలన అందించేందుకు ఉపయోగపడుతుంది’ అని తెలిపారు. రాజకీయాల స్వభావం వల్ల భారతదేశ ఎన్నికల వ్యవస్థ గణనీయంగా ప్రభావితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీల పట్ల ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఈ సమస్య ఆధారపడి ఉంటుందన్నారు. స్వేచ్చా యుత ఎన్నికల సిస్టమ్ కలిగి ఉండాలని భావిస్తున్నట్టు తెలిపారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ గణనీయమైన రాజకీయ స్వేచ్ఛను ఇవ్వాలని కోరుకుంటుందని, ఏ సమాజం కూడా ప్రత్యేక హోదాను కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు. కాగా, భావప్రకటనా స్వేచ్ఛ, సమాచార హక్కుకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తుందని పేర్కొంటూ ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.