ఎన్డీఏనా? ఇండియా కూటమా? ఉపఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

by Shamantha N |
ఎన్డీఏనా? ఇండియా కూటమా? ఉపఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల తర్వాత అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి ఎదుర్కొన్న తొలి ఎన్నికలు ఇవే. దీంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్‌లోని 4, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, బిహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోని ఒక్కో స్థానానికి జులై 10న ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగింది. కాగా.. శనివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ కొనసాగుతున్న 13 రాష్ట్రాల్లో నాలుగింట్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా.. మరో మూడుచోట్ల ఎన్డీయే ప్రభుత్వం ఉంది.

ఎక్కడెక్కడ ఎంత పోలింగ్ నమోదైందంటే?

పశ్చిమ బెంగాల్‌లోని మణిక్తలా, రణఘాట్ సౌత్, బాగ్దా, రాయ్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. 2021లో మణిక్తలా మినహా మిగిలిన మూడు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా అమర్‌వాడ అసెంబ్లీ స్థానానికి కౌంటింగ్ జరుగుతోంది. ఇక్కడ 78.1 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తరాఖండ్‌లోని మంగళూరు, బద్రీనాథ్‌ అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది. మంగళూరు అసెంబ్లీ ఉప ఎన్నికలో 68.24 శాతం, బద్రీనాథ్‌లో 51.43 శాతం పోలింగ్ నమోదయ్యింది. బిహార్‌లోని రూపాలి అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగగా.. అక్కడ 57 శాతం ఓటింగ్ జరిగింది.

Advertisement

Next Story

Most Viewed